అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా వాసి మృతి చెందారు. ఆదివారం ( అక్టోబర్ 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అమెరికాలోని హైవే 61 డిట్రీచ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహబూబాబాద్ జిల్లా మారుపేదకు చెందిన సుప్రజ మృతి చెందారు. జిల్లాకు చెందిన రేంజిత్ తో ఐదేళ్ల క్రితం సుప్రజకు వివాహం అయ్యింది.రంజిత్ అమెరికాలోని మిస్సోరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా.. భర్తతో పాటు అక్కడే ఉంటోంది సుప్రజ.
రంజిత్, సుప్రజ దంపతులకు మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు. సుప్రజ ఏపీకి చెందిన తన ఫ్రెండ్ తో కలిసి రెస్టారెంట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి రెస్టారెంట్ క్లోజ్ చేసి ఇద్దరు కార్లో ఇంటికి వస్తుండగా మరో కారును ఢీకొట్టింది.
ఈ ఘటనలో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె స్నేహితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.సుప్రజ మృతితో స్వగ్రామం మరిపెడలో, అత్తగారిల్లు మహబూబాబాద్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
