ఎన్ని కోట్ల లాభం వచ్చిందో ప్రకటించిన డీమార్ట్.. ఇన్ స్టా మార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వచ్చినా తగ్గేదేలే !

ఎన్ని కోట్ల లాభం వచ్చిందో ప్రకటించిన డీమార్ట్.. ఇన్ స్టా మార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వచ్చినా తగ్గేదేలే !

డీమార్ట్ రిటైల్ చైన్‌కు చెందిన అవెన్యూ సూపర్‌మార్ట్స్.. 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. డీ-మార్ట్ ఆదాయం 18.4 శాతం పెరిగిందని తెలిపింది. డీమార్ట్ స్టాండ్‌అలోన్ ఆదాయం ₹19,206.18 కోట్లుగా సెకండ్ క్వార్టర్ రిజల్స్ట్లో భాగంగా అవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రకటించింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్ శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ వివరాలను వెల్లడించింది.

దమానీ కుటుంబం ప్రమోట్ చేస్తున్న రిటైల్ చైన్‌కు చెందిన డీమార్ట్ మొత్తం స్టోర్ల సంఖ్య సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 518కి చేరింది. రాధాకిషన్ దమాని, అతని కుటుంబం నడుపుతున్న డీ--మార్ట్.. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, NCR, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌తో సహా పలు రాష్ట్రాల్లో స్టోర్లను నడుపుతుండటం గమనార్హం.

ఆన్‌ ‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ డీమార్ట్ రెడీ వ్యాపారాన్ని తక్కువ ఆదాయం ఉన్న ఏడు నగరాల్లో ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డీమార్ట్ రెడీ 11 నగరాల్లో సేవలు అందిస్తోంది. రాధాకిషన్ దమానీ కుటుంబం ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తోంది.