ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూత

ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూత

టాలీవుడ్ దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి హాస్పిటల్లో ఆయన కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో కూడా నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగ్ గీతం అనే సినిమాకి దర్శకత్వం వహించి చివరి రోజుల్లో కూడా సినిమాపై ఆయనకు ఉన్న మక్కువను చాటి చెప్పారు.

ఆయన మరణంపై టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 1931 సెప్టెంబర్ 21న సింగీతం జన్మించారు. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించి ఔరా అనిపించారు. ఆదిత్య 369, విచిత్ర సోదరులు, భైరవ ద్వీపం, పుష్పక విమానం, మైఖెల్ మదన కామరాజు సినిమాలు సింగీతంకు మంచి గుర్తింపు తెచ్చాయి.