వెస్టిండీస్, టీమిండియా మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ విజయం సాధించింది. మూడు సిక్సులు, 17 ఫోర్లతో 162 పరుగులతో షాయ్ హోప్ నాటౌట్గా నిలిచి విధ్వంసం సృష్టించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2-1తో వన్డే సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. మూడో వన్డేలో గెలిచి వెస్టిండీస్ పరువు దక్కించుకుంది.
వెస్టిండీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు విఫలం కావడం గమనార్హం. 41 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయిన విండీస్ జట్టు 150 పరుగుల దగ్గర రెండో వికెట్ కోల్పోయింది. 206-3, 271-4, 290-5. విండీస్ ఇలా 5 వికెట్లను కోల్పోయినప్పటికీ హోప్ సూపర్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ విండీస్ వశమైంది. అమీర్ జాంగూ 67 పరుగులతో రాణించాడు. కీమో పాల్ 44 పరుగులతో రాణించాడు.
టీమిండియా బౌలర్లలో సిరాజ్, బ్రార్, కుల్దీప్ యాదవ్, నమన్ ధీర్ తలో వికెట్ తీశారు. అమీర్ జాంగూ రనౌట్ కావడం గమనార్హం. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 92 పరుగులతో సెంచరీని జస్ట్ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ 129 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్ 57 పరుగులు, నమన్ ధీర్ 30 పరుగులు, అన్షుల్ కాంబోజ్ 17 పరుగులతో రాణించారు.
