ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పస్రా-తాడ్వాయి జాతీయ రహదారిపై ఇసుక లారీ ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతులను వరంగల్ జిల్లా కరీమాబాద్ చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ప్రమాదంతో పస్రా-తాడ్వాయి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేశారు.
