ఫ్లైదుబాయ్ విమాన ఘటన తర్వాత పైలట్ స్మిత్ మచ్చర్ పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ విమానాన్ని కాపాడేందుకు కీలక సమయంలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన పైలట్ స్మిత్ మచ్చర్ పైనే అందరి దృష్టి.. ఎవరీ మచ్చర్..విమానం నడపడంలో అతని అనుభవం ఇలా మచ్చర్ సమాచారం కోసం ఇంటర్నెట్ సెర్చింగ్ మొదలయ్యాయి. ఇంతకీ ఎవరీ మచ్చర్..?
ఫ్లై దుబాయ్ ఘటనలో కీలక సమయంలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన మచ్చర్‌కు విమానయాన రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా చేరిన స్మిత్ మచ్చర్ కు సుమారు 9వేల750 గంటల ఫ్లయింగ్ ఎక్స్ పీరియెన్స్ ఆయనకు ఉంది.
మచ్చర్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. మచ్చర్ జూన్ 2022 నుంచి ఫ్లైదుబాయ్‌లో బోయింగ్ 737 ఫ్లీట్ కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. బోయింగ్ 737-800, 737 మ్యాక్స్ 8, మ్యాక్స్9 విమానాలను నడిపిన అనుభవం ఉంది.
అంతకుముందు ముంబై కేంద్రంగా పనిచేసే స్పైస్‌జెట్‌లో సుమారు 11 ఏళ్లపాటు విధులు నిర్వహించారు మచ్చర్.అక్కడ సీనియర్ కమాండర్‌గా పనిచేసిన ఆయన.. 2020 నవంబర్‌లో లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ హోదాలో ఇతర పైలట్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారి సామర్థ్యాన్ని అంచనా వేసేవారు. స్పైస్‌జెట్‌లో పైలట్-ఇన్-కమాండ్‌గా ఆయనకు 6వేల400 గంటలకు పైగా అనుభవం ఉన్నట్లు ప్రొఫైల్‌లో చెప్పారు.
మచ్చర్ ముంబైలోని ఘట్‌కోపర్ ఈస్ట్‌కు చెందిన స్మిత్ మచ్చర్..ఉద్యోగరీత్యా దుబాయ్‌లో నివసిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వెలింకార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో 2007-08 మధ్య బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన సోదరుడు కూడా అకాసా ఎయిర్‌లో పైలట్‌గా చేయడం గమనార్హం.
ఫ్లైదుబాయ్ విమాన ఘటన తర్వాత స్మిత్ మచ్చర్ హీరో అయ్యాడు. వేల అడుగుల ఎత్తులో తీవ్ర ప్రమాదం ఎదురైన సమయంలో గాయపడినప్పటికీ ప్రయాణికుల భద్రత కోసం ఆయన చూపిన ధైర్యం, అనుభవం కీలకంగా మారింది. సుదీర్ఘ విమానయాన అనుభవం ఉన్న మచ్చర్ త్వరగా కోలుకోవాలని కుటుంబసభ్యులు, సహచరులు, ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు.
