బఠాణీతో భలే రుచులు.. సూపర్ బ్రేక్ఫాస్ట్ ..పూరీ, కట్లెట్.. ఇలా తయారు చేసుకోండి..

బఠాణీతో భలే రుచులు.. సూపర్ బ్రేక్ఫాస్ట్ ..పూరీ, కట్లెట్.. ఇలా తయారు చేసుకోండి..

పచ్చి బఠాణీల్లో ప్రొటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. మరెన్నో ప్రయోజనాలుస్న బఠాణీల్ని ఎప్పుడూ టైంపాస్ గానే ఎందుకు తినాలి. వీటితో వెరైటీ అండ్ టేస్టీ వంటలు ట్రై చేయొచ్చుగా. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే పచ్చి బఠాణీలతో  సూపర్​ బ్రేక్​ఫాస్ట్​ మీకోసం..

బఠాణీతో పూరీ తయారీకి కావలసినవి

  • పచ్చి బఠాణీలు- ఒకటిన్నర కప్పు
  • గోధుమపిండి- రెండు కప్పులు
  • బొంబాయి రవ్వ - రెండు టేబుల్ స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి-కొద్దిగా
  • ఆమ్​ చూర్ పొడి, జీలకర్ర- ఒక్కోటి అరటీ
  • స్పూన్ చొప్పున
  •  పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు- తగినంత

బఠాణీ పూరీ తయారీ విధానం

పచ్చి బఠాణీలను గంట సేవు నీళ్లలో నానబెట్టి కుక్కర్​లో వేసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు గోధుమపిండిలో పచ్చి బఠాణీ పేస్ట్, బొంబాయి రవ్వ, కొత్తిమీర తరుగు, ధనియా, అమ్​చూర్ పొడి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి పూరి పిండిలా కలపాలి. అరగంట తర్వాత ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పూరీలా ఒత్తి కాగే నూనెవేసి డీప్ ఫ్రై చేస్తే కరకరలాడే పూరీ రెడీ

బఠాణీతో కట్​ లెట్​ తయారీకి  కావాల్సినవి

  • పచ్చి బఠాణీలు - అర కప్పు
  • సగ్గుబియ్యం-ఒక కప్పు 
  • బొంబాయి రవ్వ - అర కప్పు
  •  జీల కర్ర- పావు టీ స్పూన్
  •  వంట సోడా చిటికెడు
  •  ఉల్లిగడ్డ తరుగు - కప్పు 
  • పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు- తగినంత
  •  అల్లం వెల్లుల్లి పేస్ట్- తగినంత
  •  నూనె- సరిపడా
  • ఉడికించిన అలుగడ్డ పేస్ట్- అర కప్పు
  •  కొత్తిమీర- ఒక టేబుల్ స్పూన్

బఠాణీతో కట్​ లెట్​ తయారీ విధానం

సగ్గుబియ్యం, బఠాణీలలో సరిపడా నీళ్లు పోసి వేరువేరు గంటసేపు నానబెట్టాలి. తర్వాత నీళ్లు ఒంపేసి వాటిని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. బొంబాయి రవ్వలో సగ్గుబియ్యం బఠాణీ పేస్ట్, అలుగడ్డ వేసి గుజ్జు, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని తడి బట్టపై కట్లెట్ ఒత్తి  పెనంపై రెండువైపులా కాల్చాలి.

►ALSO READ | జ్యోతిష్యం: సింహరాశిలో సూర్యుడు.. కేతువు.. నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!