భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)- ఎలక్ట్రానిక్స్ డివిజన్, బెంగళూరు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 16 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్.
- మొత్తం ఖాళీలు: 14.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
- జనరల్, ఇతర అభ్యర్థులు డిగ్రీలో మొత్తం అన్ని సంవత్సరాలు/ సెమిస్టర్లలో కలిపి కనీసం 60 శాతం మార్కులు లేదా సమాన సీజీపీఏ సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు లేదా సమాన సీజీపీఏ కలిగి ఉంటే సరిపోతుంది.
- గరిష్ట వయోపరిమితి: 23 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 8.
- లాస్ట్ డేట్: ఆగస్టు 22.
- సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ edn.bhel.comను సందర్శించండి.
►ALSO READ | డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 47 వేల జీతంతో ITATలో ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు
