ఏ బంధమూ లేని అనుబంధం.. స్నేహం, మనసుతో ముడిపడ్డ తోడు స్నేహం. స్వార్థం చూపించకుండా స్వచ్ఛమైన ప్రేమను అందించేది స్నేహం. ఎంచుకున్న దారులు వేరైనా.. అభిప్రాయాలు కుదరకపోయినా.. ఒక్క స్నేహితులే మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. ఒక్కసారి వాళ్లని కలిసి మాట్లాడితే చాలు.. జీవితకాలం ఉండిపోయే అనురాగం ఏర్పడుతుంది. అలాంటి స్నేహితులతో ఎక్కువ టచ్ లో ఉంటే.. స్ట్రెస్ పోతుందని ఓ స్టడీ చెప్తోంది..
ప్రస్తుత జీవనవిధానంలో జనాల్లో స్ట్రెస్ పెరుగుతుండడంతో ఎక్కువసేపు ఒత్తిడితోఉంటు న్నారు. టెన్షన్.. ఆందోళనతోనే పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. స్టూడెంట్స్ అయితే క్లాసెస్, ఎంప్లాయిస్ అయితే వర్క్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బిజినెస్ పీపుల్ కూడా ముఖ్యమైన పనులకు తప్ప బయటకు వెళ్ళకుండా వ్యాపారాలు మ్యానేజ్ చేస్తున్నారు. అయితే.. ఇలా ఎక్కువ సేపు ఆలోచించడం వలన స్ట్రెస్ బాగా పెరిగిపోతుందని అమెరికాకు చెందిన ఓ స్టడీ చెప్పింది. చదువులు.. ఉద్యోగాలు.. టైం పాస్ అంటూ ఫోన్లకు ఎడిక్ట్ అవ్వడం మానసికంగా కుంగదీస్తుందని హెచ్చరించింది.
ఎందుకిలా?
మొన్నటివరకూ ఇంట్లో ఉంటే ఇంటి పని, ఆఫీసుకెళితే ఆఫీసు పని ఉండేది. పనుల వల్ల ఒత్తిడి పెరిగినా ఆఫీసులో కొలీగ్స్ ఉండడంతో కాస్త రిలీఫ్ దొరికేది. పిల్లల విషయంలో కూడా అంతే. చదువుల టెన్షన్ ఉన్నా- స్కూళ్లు, కాలేజీలకు వెళ్ళడం, స్నేహితు లతో గడపడం వల్ల వాళ్లు రిలాక్స్ అవుతారు. ఇక హౌస్ వైఫ్ ల విషయానికొస్తే భర్త, పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత వాళ్లకి కొంచమైనా విశ్రాంతి దొరుకుతుంది.
►ALSO READ | బఠాణీతో భలే రుచులు.. సూపర్ బ్రేక్ఫాస్ట్ ..పూరీ, కట్లెట్.. ఇలా తయారు చేసుకోండి..
బయటకు వెళ్లే అవకాశం లేక ఫ్రెండ్స్ తో కాసేపు స్పెండ్ చేయకపోవడం వలన ఇళ్లకే పరిమితమై పోతున్నవాళ్లందరూ తెలియని మానసిక వ్యా ధులతో బాధపడుతున్నారని ఎక్స్ పర్ట్స్ అంటు న్నారు. అయితే ఈ స్ట్రెస్ ను కేవలం స్నేహితులే దూరం చేయగలుగుతారు. సరదాగా కాసేపు వాళ్లతో గడిపితే మైండ్ రీసెట్ అయిపోతుంది.
ఇప్పుడు ఎలా?
ఫ్రెండ్స్ టైం స్పెండ్ చేయాలంటే రెండు దారులు. ఒకటి ఫోన్లో మాట్లాడటం. ఇంకొకటి వెళ్లి కలవడం . ఇక సోషల్ ఇంటరాక్షన్ ఎలా కుదురుతుందనేది అందరికి వచ్చే డౌట్. అయితే టచ్ లేకుండానే. ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండొచ్చు. ఫ్రెండ్స్ ను కల వాలనుకున్నప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు మస్ట్ గా తీసుకోవాలి. ఫ్రెండ్ లేదా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లాలనుకున్నప్పుడు ఇంటికి దగ్గరలో ఎక్కడో ఒక చోట కలవాలి. కష్టాల గురించే ఎక్కువగా మాట్లాడుకోవడం కంటే మనసుకు ఉల్లాసాన్నిచ్చే కబుర్లు చెప్పుకోవాలి. అప్పుడే మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది
