ఇలాంటి నాన్న ఉంటాడా అసలు.. ఇలా చేస్తాడని ఎవరూ ఊహించరు..!

ఇలాంటి నాన్న ఉంటాడా అసలు.. ఇలా చేస్తాడని ఎవరూ ఊహించరు..!

మనిషి అన్నోడికి కొంచెం అయినా ఆలోచన ఉండాలి.. కొంచెం అయినా జ్ణానం ఉండాలి.. ఇక తండ్రి అన్నోడికి ఓపిక, సహనం చాలా అవసరం.. ఇప్పుటి పరిస్థితులు చూస్తుంటే.. కనీసం అంటే కనీసం ఇంగిత జ్ణానం అనేది లేకుండా పోతుంది. ఏం చేస్తున్నామో అనే సోయి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చదవబోయ్ వార్త ఇలాంటిదే.. ఇది చదివిన తర్వాత అసలు ఇలాంటి నాన్న ఉంటాడా.. ఇలా చేస్తాడని ఎవరూ ఊహించరు కదా అనుకోవటం ఖాయం.. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా సిటీ. రింకు, లక్ష్మి భార్యభర్తలు, వీళ్లకు 11 నెలల కుమార్తె ఉంది. ఆగ్రా సిటీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. 2026, ఆగస్ట్ 14వ తేదీన రింకు తన భార్య, 11 నెలల కుమార్తెతో బైక్ పై ఇంటి నుంచి బయలుదేరారు. అక్బరా గ్రామం సమీపంలోని యమునా నది వంతెన దగ్గరకు వచ్చారు. వంతెనపై బండి ఆపిన రింకు.. వంతెనపై సెల్పీలు తీసుకుందాం అని చెప్పాడు. భర్త ముచ్చటగా అడిగాడు కదా అని.. తన పాపతో సహా ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. 

ఆ తర్వాత తన 11 నెలల కుమార్తెను తన చేతుల్లోకి తీసుకున్నాడు రింకు.. నవ్విస్తూ.. మాటలు చెబుతూ సెల్పీ దిగాడు. ఆ వెంటనే.. తన చేతుల్లోని 11 నెలల కుమార్తెను యమునా నదిలోకి విసిరేశాడు. పక్కనే ఉన్న భార్య లక్ష్మి షాక్. ఏం జరిగిందో తెలుసుకునేలోపు.. భార్య లక్ష్మిపై దాడి చేసి.. ఆమెను కూడా నదిలోకి తోసేయటానికి ప్రయత్నించాడు. ఆమెను గట్టిగా పట్టుకుని.. నదిలోకి తోసేయటానికి ప్రయత్నిస్తుండగా.. ఇద్దరి మధ్య గొడవ, కొట్లాట జరిగింది. అటుగా వెళుతున్న జనం వాళ్ల దగ్గరకు వచ్చారు. విషయం తెలిసి.. లక్ష్మిని కాపాడి.. రింకును కొట్టారు. అతన్ని అక్కటే కట్టేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. 

నదిలో పడిన 11 నెలల చిన్నారి కోసం పోలీస్ బృందాలు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 24 గంటలుగా చిన్నారి ఆచూకీ దొరకలేదు. భార్యభర్తలు లక్ష్మి, రింకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బైక్ పై వెళుతున్న సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని.. కోపంలో.. ఆవేశంలో రింకు ఇలా చేసినట్లు చెబుతున్నాడని.. కుమార్తె హత్య వెనక ముందస్తు ప్లాన్, వ్యూహం లేదని ప్రాథమిక విచారణ తర్వాత స్పష్టం చేశారు పోలీసులు. పూర్తి విచారణ తర్వాతనే అసలు విషయం తెలుస్తుందని.. ముందుగా పాప ఆచూకీ కోసం వెతుకుతున్నామని.. ఆ తర్వాత వీళ్ల విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. ఆవేశంలో.. కోపంతో ముక్కుపచ్చలారని 11 నెలల చిన్నారిని అలా ఎలా నదిలోకి విసిరేస్తాడు అంటూ జనం చర్చించుకుంటున్నారు. అన్నెంపున్యం ఎరుగని పసిపాపను క్షణికావేశంలో ఇలా చేస్తారా అంటూ రింకును తిట్టిపోస్తున్నారు.