ఢిల్లీలో హై టెన్షన్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే, నేహా బోరా

ఢిల్లీలో హై టెన్షన్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే, నేహా బోరా

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ లెహ్రా దో తిరంగా నిరసన కార్యక్రమంతో దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. శాంతి భద్రతలు, ఇతర కారణాలతో కన్నాట్‎ప్లేస్‎లో సీజేపీ లెహ్రా దో తిరంగా ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలోనే ర్యాలీలో పాల్గొనకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సీజేపీ మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

అభిజిత్‎ను తరలిస్తోన్న పోలీస్ వాహవాన్ని సీజేపీ ప్రొటెస్టర్స్ అడ్డుకున్నారు. ఈ పరిణామంతో అక్కడ కాసేపు ఉద్రిక్తతల నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీజేపీ మద్దతుదారులను చెదరగొట్టి అభిజిత్ దీప్కేను అక్కడి నుంచి తరలించారు. సీజేపీ లెహ్రా దో తిరంగా ర్యాలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కన్నాట్ ప్లేస్ లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కన్నాట్ ప్లేస్‎ను పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకుని పలు ఆంక్షలు అమలు చేశారు.

నేహా బోరా అరెస్ట్

సీజేపీ లెహ్రా దో తిరంగా పిలుపు మేరకు ఢిల్లీలోని మండి హౌస్ ప్రాంతంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనకు అనుమతి లేకపోవడంతో ఐసా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, పంకజ్ భట్టాచార్య తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

►ALSO READ | ప్రైవేటు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులపై సుప్రీం సీరియెస్: విద్యార్థులకు ఊరటనిచ్చే తీర్పు

ఈ క్రమంలో పోలీసులు, ఐసా కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలపకుండా అడ్డుకోవమేంటని ఢిల్లీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కన్నాట్ ప్లేస్,  మండి హౌస్ ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. 

సీజేపీ లెహ్రా దో తిరంగా మార్చ్ ఎందుకుంటే..?

ధర్నాలు , ఆందోళనలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఢీనోటిఫై చేసిన జంతర్ మంతర్‎లో నిరసన వ్యక్తం చేసిన కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలపై కేసు, అరెస్ట్‎ను నిరసిస్తూ అక్టోబర్ 16వ తేదీన ఢిల్లీలోని కన్నాట్ ప్లేసులో లెహ్రా దో తిరంగా యాత్రకు సీజేపీ పిలుపునిచ్చింది. శాంతి భద్రతల కారణాలతో సీజేపీ లెహ్రా దో తిరంగా మార్చ్‎కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.