కూతురు అంజలి రెడ్డి వివాహానికి.. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ను ఆహ్వానించిన షర్మిల..

కూతురు అంజలి రెడ్డి వివాహానికి.. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ను ఆహ్వానించిన షర్మిల..

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూతురు వైఎస్ అంజలి రెడ్డి సోమల రఘురాం రెడ్డిల వివాహం నవంబర్ 25న జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ( అక్టోబర్ 16 ) షర్మిల కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ను అంజలి రెడ్డి , రఘురామ్ ల వివాహానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు షర్మిల.

తన కుమార్తె వివాహానికి కుటుంబసమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని సీఎం డీకే శివకుమార్ ను కలిసి ఆహ్వానించానని ట్వీట్ లో పేర్కొన్నారు షర్మిల. 

సీఎం శివకుమార్ ను కలవడం, కుమార్తె వివాహానికి స్వయంగా ఆహ్వానించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు షర్మిల.ఆయన చూపిన ఆప్యాయతకు, మర్యాదకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు షర్మిల. 

►ALSO READ | గరుడ సేవకు ముందు తిరుమల కొండపై కుండపోత వర్షం