కిరణ్ యార్లగడ్డ కథను అందించి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. డి.ఎస్.బాషా దర్శకత్వంలో నివేద్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ దేశ భక్తి గీతాన్ని విడుదల చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన మేజర్ ఎస్‌పీఎస్ ఒబేరాయ్ మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో కిరణ్ యార్లగడ్డ మాట్లాడుతూ ‘పాలస్తీనా వార్ టైంలో ఈ కథ రాశా. డి.ఎస్.బాషా ఈ కథకు ఓ స్వరూపాన్ని తీసుకువచ్చారు.
సైనికుడు చేసే త్యాగం, సైనికుడి భార్య చేసే త్యాగాల్ని ఇందులో చూపించాం’ అని చెప్పాడు. సైనికుల గొప్పతనం చాటేలా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు డి.ఎస్. బాషా అన్నాడు. తన తండ్రి కూడా సైనికుడేనని, ప్రతి సైనికుడికి అంకితమిచ్చేలా తమ సినిమా ఉంటుందని నిర్మాత నివేద్య రెడ్డి అన్నారు. ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సింధు తులాని ఇతర పాత్రలు పోషించారు.
