యువత మత్తుకు దూరంగా ఉండాలి : సినీ నటుడు సోనూసూద్

యువత మత్తుకు దూరంగా ఉండాలి : సినీ నటుడు సోనూసూద్
  • బేగంబజార్​లో తిరంగా బైక్‌‌ ర్యాలీ

బేగంబజార్, వెలుగు: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సినీనటుడు సోనూసూద్‌‌ సూచించారు. బేగంబజార్‌‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 80వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని భగత్‌‌సింగ్‌‌ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు లడ్డు యాదవ్‌‌ ఆధ్వర్యంలో బేగంబజార్‌‌ ఛత్రి నుంచి గౌలిగూడ వరకు శనివారం భారీ తిరంగా బైక్‌‌ ర్యాలీ నిర్వహించారు. 

లడ్డు యాదవ్‌‌తో పాటు పవన్‌‌సింగ్‌‌, అజయ్‌‌ అగర్వాల్‌‌, రోమల్‌‌సింగ్‌‌, దినేష్‌‌ యాదవ్‌‌, గురుసింది తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి సోనూసూద్‌‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసవుతోందని, వారిని ఆ వ్యసనం నుంచి దూరం చేసేందుకు సమాజమంతా చైతన్యంతో ముందుకు రావాలని కోరారు. అనంతరం పలువురు దివ్యాంగులకు వీల్‌‌చైర్లు, అనాథ విద్యార్థులకు స్కూల్‌‌ బ్యాగులను పంపిణీ చేశారు. సోనూసూద్‌‌ తో యువత, అభిమానులు సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు.