తిరుమలలో తరచూ భద్రత వైఫల్యాలు జరుగుతున్నాయి. స్వామి దర్శనానికి వెళ్లే మెట్ల మార్గంలో మరోసారి అపచారం జరిగింది. నడకదారిలో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ కనిపించారు. తోటి భక్తులు తాగవద్దని చెప్పినా లెక్కచేయకుండా ఆ వ్యక్తి ఏ మాత్రం లెక్కచేయలేదు. దర్జాగా సిగరెట్ తాగుతున్న వ్యక్తి వీడియోలు తీసిన భక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
తిరుమల కాలిబాట మార్గం పక్కనే ధూమపానం చేస్తున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. భక్తులు మండిపడుతున్నారు.. ఇది భద్రతా వైఫల్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సిగరెట్ నిప్పు కిందపడితే పక్కనే ఉన్న అటవీ ప్రాంతంతో పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అంతేకాకుండా నిప్పులు చెలరేగి పెద్ద అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి,
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న కొలువై ఉన్న తిరుమలలో సిగరెట్ మద్యం, మాంసంపై నిషేధం ఉంది. అలిపిరి దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే భక్తుల్ని కొండపైకి అనుమతిస్తారు. కానీ కొందరు మాత్రం నిబంధనల్ని పట్టించుకోవడం లేదు. కొంతమంది తనిఖీ కేంద్రాలను దాటుకుని తిరుమలకు వెలుతున్న నిషేధిత వస్తువులు తీసుకొస్తున్నారు. ఇలాంటి ఘటనలతో తిరుమలలో విజిలెన్స్, భద్రతా సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి. స్వామి దర్శనానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగాతనిఖీలు చేసిన తరువాతే కొండపైకి అనుమతించాలని భక్తులు కోరుతున్నారు.
