Pakistan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మరోసారి జట్టులో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పొట్టి ఫార్మాట్‌లో జట్టును ప్రక్షాళన చేసే పనిలో పడ్డ పాక్ మేనేజ్‌మెంట్.. త్వరలోనే టీ20 జట్టు కెప్టెన్‌ను మార్చాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు నాయకత్వం వహించిన సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) తన టీ20 కెప్టెన్సీ పదవిని కోల్పోనున్నట్లు టాక్. సూపర్–8 దశ దాటడంలో విఫలమవ్వడంతో పాటు జట్టు ప్రదర్శన నిరాశజనకంగా ఉండటంతో పీసీబీ ఈ సంచలన నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
కెప్టెన్సీ రేసు నుంచి సల్మాన్ అలీ ఆఘా ఔట్:
టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ జట్టు ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఆసియా క్రీడల్లో భాగంగా మలేషియాతో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కానీ, ఆల్‌రౌండర్‌గా సల్మాన్ అలీ ఆఘా బౌలింగ్‌లో ఆశించిన మేర రాణించకపోవడం, బ్యాటింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అతనిపై వేటు తప్పేలా లేదు. కేవలం కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా అతన్ని తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కొత్త కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్, షాదాబ్ ఖాన్:
సల్మాన్ అలీ ఆఘా స్థానంలో పాకిస్థాన్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ రేసులో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్, ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ పేర్లు ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి. కానీ ప్రస్తుత ఆసియా క్రీడల్లో జట్టును నాయకత్వం వహిస్తున్న సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) వైపే బోర్డు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. టీ20 ప్రపంచకప్‌లో ఫర్హాన్ తనదైన శైలిలో దూకుడుగా ఆడి జట్టుకు కొన్ని సానుకూలాంశాలను అందించాడు.
►ALSO READ | క్యాంప్‌బెల్ 101, హోప్ 104, జంగూ 114.. భారత్ ముందు భారీ టార్గెట్!
షాహిన్ అఫ్రిది, హరీస్ రౌఫ్‌లపై వేటు:
సల్మాన్ అలీ ఆఘాతో పాటు పాకిస్థాన్ పేస్ ద్వయం షాహిన్ షా అఫ్రిది (Shaheen Afridi), హరీస్ రౌఫ్ (Haris Rauf)లను కూడా టీ20 జట్టు నుంచి పక్కన పెట్టే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇటీవలి కాలంలో పేలవమైన ప్రదర్శన కనబరచడం, ముఖ్యంగా షాహిన్ వేగంలో పడిపోవడం, హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఖచ్చితత్వం లోపించడం వంటి కారణాలతో జట్టుకు భారంగా మారారని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ మినహా మరే జట్టుపై పాకిస్థాన్ గెలవలేకపోవడం గమనార్హం.
