ఆదిలాబాద్ లో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం.. హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, హెబ్బా పటేల్

ఆదిలాబాద్ లో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం..  హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, హెబ్బా పటేల్

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ లో ఆదివారం చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, హెబ్బా పటేల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాల్ ను ప్రారంభించారు. 

సినీ నటులు ఐశ్వర్య రాజేశ్, హెబ్బా పటేల్ ను చూసేందుకు అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదిలాబాద్ లో మొదటి సారిగా చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించడం, స్థానిక ప్రజలు చూపించిన అభిమానం పట్ల ఐశ్వర్య రాజేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో చెన్నై షాపింగ్ మాల్ ఏర్పాటు వల్ల ప్రజలకు తక్కువ ధరలకే బ్రాండెడ్ వస్త్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.