రెడ్ క్రాస్ సొసైటీ నిర్మల్ జిల్లా చైర్మన్గా గొజ్జ జనార్ధన్

రెడ్ క్రాస్ సొసైటీ నిర్మల్ జిల్లా చైర్మన్గా గొజ్జ జనార్ధన్

నిర్మల్, వెలుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్మల్ జిల్లా చైర్మన్ గా గొజ్జ జనార్ధన్ ఎన్నికయ్యారు. సోమవారం పట్టణంలో జరిగిన ఎన్నికల్లో మరో అభ్యర్థి యాటకారి సాయన్నపై జనార్ధన్ గెలుపొందారు. వైస్ చైర్మన్​గా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసీ లింగన్న, ట్రెజరర్​గా అల్లాడి రవి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా సామనపల్లి రాఘవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ సత్యనారాయణ, సహాయ ఎన్నికల అధికారులుగా శరత్ బాబు,  సాయందర్ వ్యవహరించారు.