జన్నారం, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలతో మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోని జన్నారం అటవీ డివిజన్లో నీటి కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా కుంటల వద్ద వన్యప్రాణులు, రకరకాల పక్షుల తాకిడి పెరిగింది. జన్నారం డివిజన్ లో మొత్తం 194 నీటి కుంటలను ఏర్పాటు చేసినట్లు ఎఫ్‌డీవో రామ్మోహన్ తెలిపారు. కుంటల వల్ల వన్యప్రాణుల దాహార్తిని తీర్చడమే కాకుండా, వర్షపు నీటిని నిల్వ చేసి భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా అటవీ ప్రాంతాల్లో భూగర్భ జలాల స్థాయి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
