గోదావరిఖని, వెలుగు: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుని వచ్చిన కాకా వెంకటస్వామి కుటుంబ అభిమాని, కాంగ్రెస్ లీడర్ గుమ్మడి కుమారస్వామిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం పరామర్శించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్నగర్లోని ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ లీడర్ రాచకొండ కోటేశ్వర్లును ఎంపీ పరామర్శించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కష్టసుఖాల్లో అండగా నిలుస్తామని ఎంపీ భరోసా కల్పించారు. ఆయన వెంట పి.మల్లికార్జున్, కామ విజయ్, దుబాసి మల్లేశ్, మల్లేశ్ యాదవ్, తిప్పారపు మధు, గడ్డం మధు, మగ్గిడి దీపక్, రఫీక్ పాల్గొన్నారు.
