జగిత్యాల టౌన్, వెలుగు: వాట్సాప్‌కు వచ్చిన ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేయడంతో ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.15 లక్షలు మాయమయ్యాయి. బాధితుడి కథనం ప్రకారం.. జగిత్యాల వాణీనగర్‌కు చెందిన ఎలిగేటి అశోక్‌కు వాట్సాప్‌లో ఈ-చలాన్ పేరిట ఓ ఏపీకే ఫైల్ వచ్చింది.
ఆ ఫైల్‌ను ఓపెన్ చేసిన కొద్ది సేపటికే ఆయన ఖాతా నుంచి విడతల వారీగా రూ.4.15 లక్షలు డ్రా అయినట్లు మెసేజ్‌లు రావడంతో షాక్‌కు గురయ్యాడు. బాధితుడు వెంటనే బ్యాంక్‌ను సంప్రదించగా, వారు సరిగా స్పందించలేదని బాధితుడు వాపోయాడు. అనంతరం తన స్నేహితుడైన కానిస్టేబుల్ సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
