పాన్ మసాలా యాడ్ వివాదం..బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు

పాన్ మసాలా యాడ్ వివాదం..బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు

బాలీవుడ్ ప్రముఖ నటులకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)  షాక్ ఇచ్చింది. ప్రముఖ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ లకు ఎఫ్‌డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. వివాదాస్పద పాన్ మసాలా ప్రకటనలకు సంబంధించి ఈ చర్యలు తీసుకున్నారు. 

 బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ వంటి టాప్ స్టార్లకు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ నుంచి నోటీసులు అందాయి. ప్రముఖ విమల్ ఇలాచీ (Vimal Elaichi) పాన్  మసాలా బ్రాండ్‌కు సంబంధించిన ప్రకటనల్లో వీరు నటిస్తున్నారు. అయితే ఈ ప్రకటనలు పరోక్షంగా పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.తప్పుదారి పట్టించే ప్రకటనల ప్రచురణ లేదా ప్రచారంలో భాగస్వాములుగా ఉన్న ఎవరికైనా, అదే చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించి, ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఎఫ్‌డీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

►ALSO READ | ఆదిలాబాద్ లో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం.. హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, హెబ్బా పటేల్

ఇలాంటి బ్రాండ్ల పేరుతో గుట్కా లేదా పొగాకు ఉత్పత్తులను పరోక్షంగా ప్రచారం చేయడం (సరోగసి అడ్వర్టైజింగ్) చట్టరీత్యా నేరం.ఈ నోటీసులపై ప్రముఖ నటులు ఏవిధంగా స్పందిస్తారనేదానిపై ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

తప్పుడు ప్రకటనలు ఇచ్చే సెలబ్రిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రజారోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేసే ప్రముఖులపై కఠిన నిబంధనలు అమలవుతున్న తరుణంలో, ఎఫ్‌డీఏ జారీ చేసిన ఈ నోటీసులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.