బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలతో బిజీగా ఉంది ప్రియా భవానీ శంకర్. రవితేజకు జంటగా ఆమె నటించిన ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ ‘‘ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కావేరి అనే సింపుల్ ఫ్యామిలీ ఉమెన్‌గా కనిపిస్తా. భర్త, కూతురు ఇద్దరే తన ప్రపంచం. పల్లెటూరి యాసలో డైలాగ్స్ చెప్పడం చాలెంజింగ్‌గా అనిపించింది.
రవితేజ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. కూతురిని ఎంతో ప్రేమతో, బాధ్యతతో చూసుకునే తండ్రిలా ఆయన నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇందులోని ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. అమ్మాయి ఏం జరిగినా పేరెంట్స్‌తో చెప్పడం చాలా ముఖ్యమని, అలాంటి కంఫర్ట్‌ను పేరెంట్స్ కచ్చితంగా ఇవ్వాలని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం. శివ నిర్వాణ యాక్టర్స్‌కు చాలా ఫ్రీడమ్ ఇస్తారు. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీ. ఫైనల్‌గా ఈ చిత్రం థ్రిల్లర్‌తో పాటు మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ప్రస్తుతం దూత2, డిమోంటి కాలనీ 3లో నటిస్తున్నా. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల్లో ఉన్నాయి’’
