కులగణనపై ఉత్తర్వులివ్వడం చరిత్రాత్మకం..బీజేపీ నిజమైన బీసీ పార్టీ: ఎంపీ కృష్ణయ్య

కులగణనపై ఉత్తర్వులివ్వడం చరిత్రాత్మకం..బీజేపీ నిజమైన బీసీ పార్టీ: ఎంపీ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: బీజేపీ నిజమైన బీసీ పార్టీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం చరిత్రాత్మకమని, ఇది బీసీల అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు. బ్రిటిష్ కాలంలో 1931 తర్వాత దేశంలో కులాల వారీగా లెక్కలు చేపట్టడం ఇదే తొలిసారన్నారు. 

విద్యానగర్ బీసీ భవన్‌‌లో శనివారం18 బీసీ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిర్ణయం ద్వారా జనాభా ఆధారంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు మార్గం సుగమమైందని తెలిపారు. బీసీల ఛిరకాల డిమాండ్‌‌ను నెరవేర్చిన ప్రధాని మోదీ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. బీసీ సంఘాల ప్రతినిధులు నీల వెంకటేశ్, రాజేందర్, మోడీ రాందేవ్, ఎత్తిరి భీమ్​రాజ్, నిఖిల్ పటేల్, అరవింద్ స్వామి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.