ప్రతీ గడపకూ పథకాలు అందించడమే లక్ష్యం..కొనసాగుతున్న దేవాదుల ప్రాజెక్టు పనులు

ప్రతీ గడపకూ పథకాలు అందించడమే లక్ష్యం..కొనసాగుతున్న దేవాదుల ప్రాజెక్టు పనులు

ములుగు, వెలుగు : సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద 1,318 నిరుపేద కుటుంబాలకు రూ.2.39 కోట్ల ఆర్థిక సాయం, 765 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.72.50 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు. 

ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, రామప్ప, మల్లూరు హేమాచల క్షేత్రాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ములుగు మండలం పొట్లాపూర్ వద్ద రూ.143 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.