విడుదల సన్నాహాల్లో ధరణి ఐ లవ్ యూ

విడుదల సన్నాహాల్లో ధరణి ఐ లవ్ యూ

వంశీ ఆకుల, మహిత జంటగా సాయి కృష్ణ కె.వి.దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ధరణి ఐ లవ్ యూ’. హెచ్‌‌ఎస్‌‌పీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై రాజశేఖర్ మద్దికుంట నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్‌‌ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆసక్తికరమైన కథనం, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందిస్తున్నామని దర్శకుడు సాయికృష్ణ కె.వి చెప్పారు. లవ్‌‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతోందని, త్వరలోనే ఫస్ట్‌‌ లుక్ పోస్టర్‌‌‌‌ విడుదల చేస్తామని నిర్మాత రాజశేఖర్‌‌‌‌ తెలిపారు. అర్పితా లోహి, ఆమని, వినోద్ కుమార్, మధుసూదన్, సత్య ప్రకాష్, దేవీ ప్రసాద్, అశోక్ కుమార్, బలగం సంజయ్, చిత్రం శ్రీను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.