వందేమాతరాన్ని అవమానిస్తే సహించం..కాంగ్రెస్ పార్టీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫైర్

వందేమాతరాన్ని అవమానిస్తే సహించం..కాంగ్రెస్ పార్టీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: వందేమాతరం గౌరవాన్ని తగ్గించేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ సహ ఇన్‌‌చార్జ్(కర్నాటక, తమిళనాడు), మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకత్వం జాతీయ గేయంపై సంకోచపూరిత వైఖరిని అనుసరిస్తుందని  ఆయన విమర్శించారు. వందేమాతరం కేవలం ఒక గేయం కాదని, అది భారతమాతపై భక్తికి, దేశ ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. 

రాజకీయ ప్రయోజనాల కోసం దేశ వారసత్వాన్ని తక్కువ చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వందేమాతరం పూర్తి ఆరు చరణాలను ఆలపించేలా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిందని, ఇది భావితరాలకు మన గొప్ప సంస్కృతిని అందించే చర్య అని కొనియాడారు. జాతీయ చిహ్నాలను, గౌరవ ప్రతీకలను ఉద్దేశపూర్వకంగా అవమానించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు