పోక్సో కేసుల శిక్షల్లో భారీ పెరుగుదల...2025లో 20.21 శాతానికి పెరిగిన శిక్షలు

పోక్సో కేసుల శిక్షల్లో భారీ పెరుగుదల...2025లో 20.21 శాతానికి పెరిగిన శిక్షలు
  •     ఇంకా  8,782 అత్యాచార, పోక్సో కేసులు పెండింగ్

న్యూఢిల్లీ, వెలుగు: గతేడాది తెలంగాణలో అత్యాచార, పోక్సో కేసుల విచారణలో గణనీయమైన మార్పు వచ్చింది. 2023, 2024 సంవత్సరాలతో పోలిస్తే 2025లో పోక్సో కేసుల్లో శిక్షల ఖరారు దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 2023లో 7.12 శాతం, 2024లో 7.0 శాతం పోక్సో కేసుల్లో మాత్రమే శిక్షలు పడగా.. 2025 నాటికి ఈ సంఖ్య 20.21 శాతానికి చేరింది. 

ఈ ఏడాది జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 399 ఎక్స్‌‌క్లూజివ్ పోక్సో కోర్టులతో కలుపుకొని మొత్తం 779 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు (ఎఫ్టీఎస్సీ) కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు పనిచేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇన్ని ప్రత్యేక కోర్టులు ఉన్నప్పటికీ జూన్ చివరి నాటికి రాష్ట్రంలో మొత్తం 8,806 అత్యాచార, పోక్సో కేసులు పెండింగ్‌‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ పార్లమెంట్‌‌లో స్పష్టం చేసింది.