సింక్‌ఫీల్డ్‌ కప్‌: వెస్లీ సోతో మ్యాచ్ డ్రా.. సంయుక్తంగా రెండో స్థానంలో ప్రజ్ఞానంద!

సింక్‌ఫీల్డ్‌ కప్‌: వెస్లీ సోతో మ్యాచ్ డ్రా.. సంయుక్తంగా రెండో స్థానంలో ప్రజ్ఞానంద!

సెయింట్‌‌‌‌‌‌‌‌ లూయిస్‌‌‌‌‌‌‌‌ (అమెరికా): ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద.. సింక్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో పోడియం రేసులో నిలిచాడు. అమెరికా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ వెస్లీ సోతో శనివారం జరిగిన ఐదో రౌండ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌ను ప్రజ్ఞా 26 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. కింగ్‌‌‌‌‌‌‌‌ పాన్‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద గేమ్‌‌‌‌‌‌‌‌ ఆరంభం నుంచే మెరుగ్గా ఆడాడు.

కీలక టైమ్‌‌‌‌‌‌‌‌లో వెస్లీని అడ్డుకుని గేమ్‌‌‌‌‌‌‌‌ను డ్రాగా ముగించాడు. వెస్లీ మూడున్నర పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. జోర్డెన్‌‌‌‌‌‌‌‌ వాన్‌‌‌‌‌‌‌‌ ఫోరెస్ట్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌, 1).. మాక్సిమ్‌‌‌‌‌‌‌‌ వాచియర్‌‌‌‌‌‌‌‌ లాగ్రెవ్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌, 1), జావోఖిర్‌‌‌‌‌‌‌‌ సిందరోవ్‌‌‌‌‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌, 2).. సావియన్‌‌‌‌‌‌‌‌ శామ్యూల్స్‌‌‌‌‌‌‌‌ (అమెరికా, 2.5) మధ్య జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌లు డ్రాగా ముగిశాయి. విన్సెంట్‌‌‌‌‌‌‌‌ కీమర్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ, 3).. అనిష్ గిరి (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌, 1.5)పై, ఫ్యాబియానో కరువాన (అమెరికా, 3).. లెవోన్‌‌‌‌‌‌‌‌ అరోనియన్‌‌‌‌‌‌‌‌ (అమెరికా, 2.5)పై గెలిచారు.