హింగోలి: స్వాతంత్ర్యం వచ్చి 80 ఏండ్లు గడుస్తున్నా దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయని కాక్రోచ్జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణల డిమాండ్‌తో ‘స్కూల్ ఠీక్ కరో’ (స్కూళ్లను బాగు చేయండి) పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు.
శనివారం తన బృందంతో కలిసి మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో గల తన స్వగ్రామమైన సంతుక్ పింప్రిలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో అభిజీత్ దీప్కే మొదటి ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ స్టూడెంట్లకు బెంచీలు, తాగునీరు వంటి కనీస వసతులు లేకపోవడాన్ని ఆయన వెలుగులోకి తెచ్చారు. మురికి వాష్‌రూమ్‌లు, పగిలిన కిటికీల అద్దాలు వంటి సమస్యలు ఉన్నట్టు విద్యార్థినుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సమస్యలపై ఆ గ్రామ సర్పంచ్‌తో మాట్లాడారు. వారం రోజుల్లో పంచాయతీ ద్వారా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చినట్టు దీప్కే తెలిపారు.
