ముంబై సిటీకి వందే మెట్రో లోకల్ రైళ్లు

ముంబై సిటీకి వందే మెట్రో లోకల్ రైళ్లు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై సబర్బన్ రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎంఆర్​వీసీ) ప్రతిష్టాత్మక ముంబై అర్బన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ ప్రాజెక్ట్ (ఎంయూటీపీ) కింద ఏకంగా 238 ఏసీ లోకల్ రైళ్లను (వందే మెట్రో) దేశీయంగానే తయారు చేయాలని నిర్ణయించింది. ముంబై సంచార రంగానికి తిరుగులేని ఊతమిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఎంఆర్​వీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విలాస్ వాడేకర్ వెల్లడించారు.

గతంలో ఈ 238 ఏసీ లోకల్ రేకుల కొనుగోలు కోసం అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించినప్పటికీ, ఆ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడంతో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దీంతో వీటిని దేశీయంగానే తయారు చేయాలని నిర్ణయించారు.