జెండా ఎగరేసిన టెర్రరిస్టు పేరెంట్స్.. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని  షోపియాన్‌‌‌‌లో ఘటన

జెండా ఎగరేసిన టెర్రరిస్టు పేరెంట్స్.. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని  షోపియాన్‌‌‌‌లో ఘటన

షోపియాన్: లష్కరే తాయిబా (ఎల్‌‌‌‌ఈటీ) టాప్ కమాండర్ ఆబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా షోపియాన్‌‌‌‌లోని తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేశారు.  కాశ్మీర్ లోయలో పలు టెర్రర్ దాడులకు సంబంధించిన కేసుల్లో ఆబిద్ భద్రతా దళాల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) నుంచి ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఆబిద్..  కాశ్మీర్‌‌‌‌లోని స్థానికేతర కార్మికులే లక్ష్యంగా దాడులు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆబిద్ రంజాన్ వాంటెడ్ లిస్ట్‌‌‌‌లో ఉన్నప్పటికీ, అతడి తల్లిదండ్రులు తమ ఇంటి పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని  ఎగురవేయడం విశేషం. ఈ ఘటన 2021 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గుర్తుకు తెచ్చింది. అప్పుడు హిజ్బుల్ ముజాహిదీన్ మాజీ కమాండర్ బుర్హాన్‌‌‌‌ వానీ తండ్రి, ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాలైన ముజఫర్ వానీ స్కూల్ ప్రాంగణంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.