ఎయిర్‌‌‌‌స్పేస్ కోసం.. చైనాతో భారత్ చర్చలు

ఎయిర్‌‌‌‌స్పేస్ కోసం.. చైనాతో భారత్ చర్చలు

న్యూఢిల్లీ: పాకిస్తాన్ గతేడాది ఏప్రిల్ నుంచి భారత విమానాలకు తన ఎయిర్ స్పేస్ మూసివేసింది. తాజాగా దీనిని మరో నెలపాటు పొడిగించింది. దీనివల్ల భారత్ నుంచి యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు వెళ్లే మన విమానాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. జర్నీ టైం, ఇంధన ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల కోసం భారత్ చైనాతో దౌత్య చర్చలు జరుపుతున్నది. 

చైనాలోని షింజియాంగ్, హోటాన్ ఎయిర్‌‌‌‌స్పేస్ మీదుగా విమాన మార్గాన్ని అనుమతించాలని డ్రాగన్ కంట్రీని కోరుతోంది. ఈ అంశంపై ఏడాదిగా ఇరుదేశాల విదేశాంగ శాఖలు, అధికారుల మధ్య నిరంతరం సంప్రదింపులు సాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌‌‌‌పింగ్ హాజరైన తరుణంలో ఈ ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి. షింజియాంగ్, హోటాన్ ఎయిర్‌‌‌‌స్పేస్ అందుబాటులోకి వస్తే.. పాక్​ ఆంక్షల వల్ల మన దేశానికి తలెత్తుతున్న ప్రయాణ ఇబ్బందులకు శాశ్వత ఉపశమనం లభించనుంది.