ఇండియా vs చైనా.. విమెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నేడు

ఇండియా vs  చైనా.. విమెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నేడు
  • సా. 4.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, డీడీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌


ఆమ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌వీన్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌): ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ రెడీ అయ్యింది. ఆదివారం జరిగే పూల్‌‌‌‌‌‌‌‌–డి తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా.. బలమైన చైనాతో తలపడనుంది. ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ మారడం, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లాంటి బలమైన జట్లు ఇదే పూల్‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో ఇండియా తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నుంచే విజయాలు సాధించాల్సి ఉంటుంది. యూరోపియన్‌‌‌‌‌‌‌‌ వాతావరణానికి అలవాటుపడేందుకు చాలా రోజుల ముందు ఇక్కడికి వచ్చిన ఇండియా.. వాజ్‌‌‌‌‌‌‌‌నెర్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో కఠోరంగా శ్రమించింది. ఇండియా ఇప్పటి వరకు వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో అత్యుత్తమంగా 1974లో జరిగిన తొలి ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో అజిందర్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ సారథ్యంలో నాలుగో స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత జరిగిన 15 ఎడిషన్లలో కేవలం ఎనిమిదిసార్లు మాత్రమే అర్హత సాధించిన ఇండియా 2022లో 9వ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఆ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జట్టులోని 11 మంది సభ్యులకు వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఆడటం ఇదే మొదటిసారి. గోల్‌‌‌‌‌‌‌‌కీపర్‌‌‌‌‌‌‌‌ సవిత 313 అంతర్జాతీయ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లతో టోర్నీలో అత్యంత అనుభవజ్ఞురాలైన ప్లేయర్‌‌‌‌‌‌‌‌.  డిఫెండర్‌‌‌‌‌‌‌‌ సుశీల చాను 262 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడగా, నవ్‌‌‌‌‌‌‌‌నీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌, నిక్కి ప్రధాన్‌‌‌‌‌‌‌‌, నేహా గోయల్‌‌‌‌‌‌‌‌ కూడా 200 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల మైలురాయిని దాటారు. మరోవైపు అన్ని అంశాల్లో బలంగా ఉన్న చైనా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా దిగుతోంది.