స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐకూ విద్యార్థుల కోసం జెడ్11 స్మార్ట్ఫోన్ను ఈ నెల 20న మార్కెట్లోకి తెస్తోంది. రూ.40 వేల లోపు ధరలో లభించే ఈ ఫోన్ చదువుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి, కంటెంట్ సృష్టించడానికి, ఏఐ వాడకం కోసం ఎంతో ఉపయోగపడుతుంది. లెక్చర్లు, సమావేశాలలో ముఖ్యమైన అంశాలను సులభంగా నోట్ చేసుకోవడానికి సాపడుతుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్, అమోలెడ్ డిస్‌ప్లే, 7,050 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నోయిడా ఫ్యాక్టరీలో దీనిని తయారు చేస్తున్నామని ఐకూ తెలిపింది.
