మొబావెన్యూ ఏఐ టెక్ ఆదాయం రూ.72 కోట్లు

మొబావెన్యూ ఏఐ టెక్ ఆదాయం రూ.72 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: డిజిటల్ ​యాడ్స్ ​కంపెనీ మొబావెన్యూ ఏఐ టెక్ ఆదాయం 2027 మొదటి క్వార్టర్​లో 56.9 శాతం పెరిగి రూ.72.8 కోట్లకు చేరుకుంది. పన్ను తర్వాత నికర లాభం రెట్టింపై రూ.11.7 కోట్లుగా నమోదైంది. ఇబిటా 77 శాతం వృద్ధితో రూ.15.4 కోట్లకు చేరింది. ప్రకటనల ప్రక్రియను వేగవంతం చేయడానికి మొబావెన్యూ న్యూరల్ ఇంజిన్‌‌‌‌ను ప్రారంభించారు. ఈ అత్యాధునిక సిస్టమ్ ద్వారా కేవలం 59 సెకన్లలోనే లైవ్  క్యాంపెయిన్‌‌‌‌ను  ప్రారంభించవచ్చు. క్విక్ కామర్స్, రిటైల్ రంగాల నుంచి బలమైన డిమాండ్ వచ్చింది.  యాపిల్ యాడ్స్ కోసం ప్రత్యేకంగా పైఎక్స్ అనే గ్రోత్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ను ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో 155కి పైగా బ్రాండ్లకు సేవలు అందిస్తున్నామని మొబా తెలిపింది.