క్యూర్ పరిధిలో ఒక్క ఇంటికి 8 మందికి పైగా పోటీ..ఇందిరమ్మ టవర్స్కు 60 వేలకు పైగా అప్లికేషన్లు

క్యూర్ పరిధిలో  ఒక్క ఇంటికి  8 మందికి పైగా పోటీ..ఇందిరమ్మ టవర్స్కు 60 వేలకు పైగా అప్లికేషన్లు
  •     క్యూర్​ పరిధిలో ఇందిరమ్మ టవర్స్​కు 60 వేలకు పైగా అప్లికేషన్లు: వీపీ గౌతమ్

హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు భారీగా వచ్చాయి. 16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్లకు శనివారం సాయంత్ర వరకు 60,014 అప్లికేషన్లు వచ్చినట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ ఓ ప్రకటనలో తెలిపారు. అంటే సగటున ఒక్కో ఫ్లాట్ కు 8 మందికి పైగా అప్లై చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. టవర్ల నిర్మాణాల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని.. వచ్చే నెల మొదటి వారంలో పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా లాటరీ ద్వారా జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావులేదని గౌతమ్ స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఎల్ బీ నగర్, చాంద్రాయణ గుట్ట, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఆదివారం నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నట్టు ఆయన వెల్లడించారు. వచ్చే నెల 3 వరకు గడువు ఉంటుందని తెలిపారు.