రేసింగ్ లుక్‌తో మహీంద్రా BE.6.. బ్లాక్ అండ్ ఆరెంజ్ క్యాబిన్ ప్రత్యేక ఆకర్షణ

రేసింగ్ లుక్‌తో మహీంద్రా BE.6.. బ్లాక్ అండ్ ఆరెంజ్ క్యాబిన్ ప్రత్యేక ఆకర్షణ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీ బీఈ 6 స్పోర్ట్‌‌ ఈక్యూ, ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్‌‌ను ఇండియాలో లాంచ్  చేసింది.  లండన్ ఈ-ప్రిక్స్ వేదికగానూ దీనిని ప్రదర్శించింది.  ఈ కార్లలో యాక్సిలరేషన్ బూస్ట్ ఫీచర్‌‌ ఉంది. దీంతో  కేవలం 6.44 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని  అందుకుంటాయి.  రేస్ కాక్‌‌పిట్, బ్లాక్ అండ్ ఆరెంజ్ క్యాబిన్ దీని ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. 

మహీంద్రా బీఈ 6 స్పోర్ట్ఈక్యూ ధర బ్యాటరీతో కలిపి అయితే  రూ. 19.45 లక్షల నుంచి రూ.26.95 లక్షల మధ్య ఉంది.  బ్యాటరీని కిరాయి పద్ధతిలో తీసుకుంటే ధర  రూ. 11.45 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.  అద్దె కి.మీ.కు రూ. 3.75 వరకు ఉంటుంది. బీఈ6 స్పోర్ట్‌‌ ఈక్యూ ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్  ధర రూ. 24.45 లక్షలు.