కరీంనగర్ యువతికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం !

కరీంనగర్ యువతికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం !

కరీంనగర్: కరీంనగర్ జమ్మికుంట గణేష్ నగర్‌కు చెందిన వడ్లకొండ సింధుజకు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం రావడంతో స్థానికంగా హర్షం వ్యక్తమైంది. జమ్మికుంటలో ప్రాథమిక విద్య, హనుమకొండలో ఇంటర్ పూర్తి చేసి, హైదరాబాద్‌లో డిగ్రీతో పాటు ఐఏఎస్ కోచింగ్ తీసుకున్న సింధుజ ఐఏఎస్‌లో విజయం సాధించలేకపోయినా పట్టుదలతో ఐబీ పరీక్ష రాసింది.

పరీక్షతో పాటు ఇంటర్వ్యూలోనూ ఉత్తీర్ణత సాధించిన సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు ఎంపికైన సింధుజపై స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు. ఐబీ ఉద్యోగం సాధించినప్పటికీ, భవిష్యత్తులో మరోసారి ఐఏఎస్ పరీక్ష రాస్తానని సింధుజ చెప్పింది.