బీఆర్ ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. బావబామ్మర్థులు ఇద్దరు అభివృద్ది పై చర్చకు రావాలని అంటున్నారు..సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు పెడతా..మాజీ సీఎం కేసీఆర్ ను తీసుకొని అసెంబ్లీకి రావాలి.. అప్పుడు చర్చిద్దాం అభివృద్దిపై అని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లీ బీఆర్ ఎస్ పాలనలో అప్పులే మిగిలాయన్నారు. పదేళ్లు చేసిన అప్పులకు నెలకు 7500 కోట్ల చొప్పును మిత్తీల కడుతున్నామన్నారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కటితే అది కూళేశ్వరం అయిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.
రైతులకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం వచ్చిన 32 నెలల్లోనే 36వేల కోట్లు రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసి తెలంగాణ రైతాంగాన్ని రుణ విముక్తుల్ని చేశామన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లకు రూ. 90 కోట్లు ఇచ్చామన్నారు. రైతలకు ఉచిత విద్యుత్తు అందించేందుకురూ. 30వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. సన్నవడ్లు పండించిన రైతుకు క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల కుటుంబంలో ఏ ఒక్కరికైనా చిన్నా గాయమైనా అయ్యిందా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో కార్యకర్తులు రక్తదానం చేస్తే .. కేటీఆర్, హరీశ్ రావులు కోట్లకు అమ్ముకున్న రక్త పిపాసులు కేటీఆర్, కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రైతులు, ఆడబిడ్డలు, నిరుద్యోగుల కోసమే మా ప్రభుత్వం పనిచేస్తున్నది.. మా పాలనను, కేసీఆర్ పాలను ఒక్కసారి చూడండి.. కేసీఆర ను గెలిపిస్తే.. కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే లాభం.. నన్ను గెలిపిస్తే బీసీ బిడ్డలకు లాభమని అన్నారు సీఎం. బోల్తా కొట్టిన బండిని పట్టాలెక్కించాం.. ఇక పరుగులెత్తించు ఉన్నది అని సీఎం ధీమా అన్నారు.
