KFC చికెన్ పీసులు పీక్కుని తింటున్నారా..? అయితే ఈ విషయం తెలిసి ఉండదు పాపం !

KFC చికెన్ పీసులు పీక్కుని తింటున్నారా..? అయితే ఈ విషయం తెలిసి ఉండదు పాపం !

మంగళూరు: వీకెండ్ వచ్చిందంటే చాలు.. మెట్రో సిటీల్లో మెజారిటీ పబ్లిక్కు మూడే మూడు విషయాలపై వ్యామోహం, వ్యాపకం ఉంటుంది. షాపింగ్ చేయాలి. సినిమా చూడాలి. ఇంటికి వస్తూ వస్తూ బయట ఏ KFCకో, పిజ్జా హట్కో లేకపోతే ఏ ఫేమస్ రెస్టారెంట్కో పోయి చికెన్ పీసులు, మటన్ పీసులు ఆవురావురమని లాగించేయాలి.

లేదంటే.. ఇంట్లోనే కూర్చుని ఏ స్విగ్గీలోనో, జొమాటోలోనో ఇదే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేయాలి. దాదాపు చాలా మంది సిటీ పబ్లిక్ షెడ్యూల్ వీకెండ్స్లో ఇలానే ఉంటుంది. అయితే.. ఇలానే ఈ వీకెండ్లో మంగళూరులోని ఒక కేఎఫ్సీ ఔట్ లెట్లో చికెన్ పీసులు ఆర్డర్ చేసుకుని తిన్న ఒక కస్టమర్కు చేదు అనుభవం ఎదురైంది.

ఆర్డర్ చేసుకున్న KFC చికెన్ పీసులను తిందామని ఓపెన్ చేయగానే దుర్వాసన వచ్చాయి. దీంతో.. విస్తుపోవడం సదరు కస్టమర్ వంతైంది. వెంటనే.. కోపంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు మంగళూరులోని ఆ KFC ఔట్లెట్పై ఫిర్యాదు చేశాడు. బాధిత కస్టమర్ ఫిర్యాదుతో మంగళూరు కేఎస్ రావు రోడ్డులోని సిటీ సెంటర్లో ఉన్న KFC ఔట్ లెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఈ రైడ్స్లో భాగంగా అధికారులు.. వంట గది, స్టోర్ రూమ్, కోల్డ్ స్టోరేజ్ ఏరియాలను తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం.. తప్పు జరిగిందని నిర్ధారించిన అధికారులు ఈ KFC ఔట్ లెట్ను మూసేయించారు. ఫుడ్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. ల్యాబ్ రిజల్ట్స్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.