బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి: రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి: రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో 100 బీసీ కాలేజీ హాస్టళ్లు, 100 బీసీ గురుకుల స్కూళ్లు మంజూరు చేయడంతో పాటు వాటికి సొంత భవనాలు నిర్మించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్​ చేశారు. ఆదివారం ఆయన విద్యార్థులతో కలిసి ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లలో విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, సచివాలయం నిర్మించేందుకు నిధులు ఉన్పప్పుడు.. హాస్టళ్లు, గురుకులాల భవనాల నిర్మాణానికి ఎందుకు ఉండవని ప్రశ్నించారు. ఉద్యోగుల సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం యాదయ్య, రాజేందర్ పాల్గొన్నారు.