హైదరాబాద్ సిటీలో మత్తు పదార్థాల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఆన్ లైన్ లోఆర్డర్ ఆఫ్ లైన్ రవాణా చేసి పోలీసులకు చిక్కకుండా ఈ దందాను సాగిస్తున్నారు. కొరియర్ ద్వారా ఈ మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరలకు నిషేధిత మత్తు ఇంజెక్షన్లను కొనుగోలు చేసి అధిక ధరలకు ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్నారు.ఈ మత్తు పదార్థాల మోజులో పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సిటీలో ఇలాంటి అక్రమ దందాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు కట్టదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఆదివారం (ఆగస్టు 16) ఫలక్ నుమాలో మెఫెంటెర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముగ్గురిని హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ , రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్ట చేశారు. పంద్రాగస్టు రోజున ఫలక్ నుమా పరిధిలోని నవాబ్ సాహెబ్ కుంట దగ్గర మహ్మద్ ఇజాజ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ మత్తుపదార్థాల దందా బయటపడింది. ఈ దాందా నడుపుతున్న ప్రధాని నిందితులు మహ్మద్ జుబేర్, మహ్మద్ సైఫ్ ఖాన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవ్యక్తి శుభం రాజ్ పుత్ పరారీలో ఉన్నాడు.
నిందితులనుంచి 110 మెఫెంటెర్మెన్ సల్ఫేట్ వయల్ష్, 25 సిరింజిలు, మూడు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. వీటి విలువు రూ 6లక్షలు ఉంటుందని అంచనా. జుబేర్ ఇండియా మార్ట్ ద్వారా ఇంజెక్షన్లను ఆర్డర్ చేసి కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో ఇంజక్షన్ వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసి 5వేలనుంచి 8 వేల వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
డ్రగ్స్ మత్తులో ఆరోగ్యాన్నరి, కుటుంబాలను భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు యువతను హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయం, వినియోగంపై సమాచారం తెలిస్తే వెంటనే 112కు తెలియజేయాలని సూచించారు.
