- అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య
- పనుల్లో ఆలస్యంపై అసంతృప్తి
దండేపల్లి/జన్నారం రూరల్, వెలుగు: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు.
దండేపల్లి మండలం రెబ్బన్పల్లిలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఆదివారం పరిశీలించారు. నాలుగు బ్లాక్‌లు, ప్లే గ్రౌండ్స్ వంటి మౌలిక సదుపాయాలతో నిర్మించాల్సిన స్కూల్ రెండేండ్లయినా ఒక్క బ్లాక్ కూడా పిల్లర్ లెవెల్ వరకు కాకపోవడం, పనులు నత్తనడకన సాగడంపై సైట్ ఇంజనీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే విద్య సంవత్సరం నాటికి స్టూడెంట్స్ అడ్మిషన్స్ పొందడానికి ఫిబ్రవరిలోగా అన్ని పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఎంపీవో విజయ్ ప్రసాద్, ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, ఎంఈవో మంత్రి రాజు, సర్పంచ్ కందుల కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
