టాలీవుడ్ టాలెంటెడ్ యాకర్ట్ నరేశ్ అగస్త్య, కామెడీ కింగ్ వెన్నెల కిశోర్, ఫన్ బాంబ్ సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘ఎంఆర్‌పీ’ (MRP). ‘నీకెంత.. నాకెంత’ అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూలై 17న థియేటర్లోకి వచ్చి అలరించింది.
మార్చురీలో పనిచేసే నలుగురు యువకులు గుర్తుతెలియని శవాన్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలని వేసిన ప్లాన్ చుట్టూ కథ సాగుతుంది. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతూ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది. శ్రవణ్ జేష్ట డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నరేశ్ అగస్త్య, వెన్నెల కిషోర్, సుదర్శన్, కసిరెడ్డి రాజ్ కుమార్ మధ్య వచ్చే సీన్స్ మెప్పిస్తాయి.
Prime Video Link 🔗 https://t.co/PWSUsdU02I
— Sri Balaji Video (@sribalajivideos) August 14, 2026
JioHotstar Link 🔗 https://t.co/6bYtzsXaNj
Every moment has a surprise. Every scene brings a smile.🤩#MRP (Neekentha Naakentha) Latest Full Movie Streaming Now in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam Languages on Prime Video &… pic.twitter.com/y8DKjxOlII
కథేంటంటే:
మనోహర్ (నరేశ్ అగస్త్య), పరమేశ్వర్ (సుదర్శన్), రవి (కసిరెడ్డి రాజ్ కుమార్) ముగ్గురూ మంచి స్నేహితులు. హైదరాబాద్‌లో ఒకే రూమ్‌లో ఉంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటారు. తన ఆఫీసులో పనిచేసే అమృత మనోహర్‌ను ప్రేమిస్తుంది. తక్కువ జీతంతో సంతృప్తి చెందని మనోహర్ బిజినెస్ చేసి జీవితాన్ని మార్చుకోవాలనుకుంటాడు. డబ్బు కోసం ముగ్గురూ సొంతూరికి వెళ్లినా ఫలితం ఉండదు. ఈ క్రమంలో కామేశ్వరరావు హత్య జరుగుతుంది. అతని పెద్ద కొడుకు దైవాజీ (నందగోపాల్) రౌడీగా, వడ్డీ వ్యాపారిగా ఉంటాడు.
►ALSO READ | Director Raja Sen: షూటింగ్ సెట్‌లో ప్రమాదం.. వెంటిలేటర్‌పై 3 నేషనల్ అవార్డ్స్ డైరెక్టర్..!
అతని దగ్గర అప్పు తీసుకున్న ముగ్గురు స్నేహితులు గడువులోగా వడ్డీ చెల్లించలేకపోవడంతో, రెండు రోజుల్లో మొత్తం బాకీ తీర్చాలని దైవాజీ హెచ్చరిస్తాడు. దాంతో డబ్బు కోసం కామేశ్వరరావు మృతదేహాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తారు. అయితే హాస్పిటల్‌కు వెళ్లేసరికి కామేశ్వరరావు మృతదేహం స్థానంలో ఓ మహిళ శవం కనిపిస్తుంది. ఆ మహిళ ఎవరు? కామేశ్వరరావు బాడీ ఏమైంది? ఆమె ఎలా చనిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ముగ్గురు స్నేహితులు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారు? చివరకు ఆ చిక్కుముడి ఎలా వీడిందనేదే మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే?
సీరియస్ క్రైమ్ కథకు కామెడీని జోడించడం సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్, కసిరెడ్డి రాజ్ కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. కొన్ని సందర్భాల్లో కామెడీ సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్లడంలోనూ ఉపయోగపడతాయి.
ఫస్ట్ హాఫ్‌లో.. ముగ్గురు స్నేహితుల పరిచయం, వారి ఆర్థిక సమస్యలు, డబ్బు కోసం వేసే ప్లాన్‌ను దర్శకుడు సింపుల్‌గా ఎస్టాబ్లిష్ చేశాడు. మృతదేహం స్థానంలో మహిళ శవం కనిపించే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్‌లో.. మహిళ శవం వెనుక ఉన్న అసలు కథను ఛేదించే ప్రయత్నంలో హీరోలు చిక్కుల్లో పడటం, వరుస పరిణామాలు కథను ముందుకు తీసుకెళ్తాయి. అయితే కొన్ని చోట్ల కథనం కొంత నెమ్మదిగా అనిపిస్తుంది. కొన్ని ట్విస్టులను మరింత బలంగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఇంకా పెరిగేది.
