మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజత్వానికి దగ్గరగా సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఉత్కంఠ రేపే ట్విస్టులు, చివరి వరకు ఆసక్తిని కొనసాగించే కథనాలతో ఈ జానర్ సినిమాలు థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకుంటుంటాయి. ఇప్పుడు అదే కోవలో తెరకెక్కిన మరో ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఉయిర్’ (Uyir).
రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి థ్రిల్లర్ ప్రియుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా కథనం, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ‘ఉయిర్’.. ఇప్పుడు జియో హాట్‌స్టార్ వేదికగా సందడి చేస్తుంది. కట్టిపడేసే ట్విస్టులతో ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ కథనం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
ఓ పాడుబడిన బావిలో మహిళ మృతదేహం లభించడంతో యువ పోలీస్ అధికారి అజీబ్ దర్యాప్తు ప్రారంభిస్తాడు. మొదట ఆత్మహత్యగా భావించిన ఈ కేసు, విచారణలో ఊహించని మలుపులు తిరుగుతుంది. మృతురాలి భర్తగా చెప్పుకున్న వ్యక్తి అసలు ఆమె భర్తే కాదని తేలడంతో కేసు పూర్తిగా కొత్త దిశలో వెళ్తుంది. ప్రతి ఆధారం మరో రహస్యాన్ని బయటపెడుతుండగా, ఈ హత్య వెనుక అసలు నిజం ఏంటన్నది మరింత మిస్టరీగా మారుతుంది. శోభను హత్య చేసింది ఎవరు? భువనేశ్ ఎవరు? అతనికి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏమిటి? అనేదే మిగతా కథ.
ഉശിരുള്ള പോലീസ് ത്രില്ലർ!
— JioHotstar Malayalam (@JioHotstarMal) August 9, 2026
Uyir is now streaming exclusively on JioHotstar in Malayalam, Tamil, Telugu, Kannada, and Hindi.#Uyir #JioHotstar #JioHotstarMalayalam #Thriller #Drama #MalayalamMovie pic.twitter.com/H3hXYaKKB6
విశ్లేషణ:
‘ఉయిర్’ సాధారణ మర్డర్ మిస్టరీలా మొదలై, కథ ముందుకు వెళ్లే కొద్దీ మరిన్ని ప్రశ్నలను లేవనెత్తే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. పాడుబడిన బావిలో మహిళ మృతదేహం లభించడం నుంచి మొదలయ్యే దర్యాప్తు.. మొదట ఆత్మహత్యగా కనిపించిన కేసును హత్యగా మార్చడంతో ఆసక్తి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా మృతురాలి భర్త విషయంలో బయటపడే నిజం కథను మరో మలుపు తిప్పుతుంది.
►ALSO READ | Mahesh Babu: దైవం మహేష్ రూపేణ.. చిన్నారులకు అండగా నిలుస్తున్న సూపర్ స్టార్ కథ
సినిమాలో పెద్దగా కమర్షియల్ హంగులు లేకుండా ఇన్వెస్టిగేషన్, పాత్రల ప్రవర్తన, ఆధారాల వెనుక దాగి ఉన్న నిజాలు వంటి అంశాలపైనే కథను నడిపించడం ప్లస్ పాయింట్. ఒక క్లూ దొరికిన ప్రతిసారీ కొత్త ప్రశ్న ఎదురవ్వడం, ఆ ప్రశ్నకు సమాధానం కోసం వెళ్లే కొద్దీ మరో రహస్యం బయటపడటం ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తుంది. ముఖ్యంగా శోభను ఎవరు హత్య చేశారు? భువనేశ్ అసలు ఎవరు? అతనికి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలను చివరి వరకు దాచిపెట్టే విధానం థ్రిల్లర్ ప్రియులను ఎంగేజ్ చేస్తుంది.
►ALSO READ | అలా ఆడకూడదు మియా: సిరాజ్‌కి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పాఠాలు.. వీడియో వైరల్!
రోషన్ మ్యాథ్యూ తన పాత్రకు తగ్గట్టుగా సహజమైన నటనతో ఆకట్టుకుంటారు. పోలీస్ ఆఫీసర్ అజీబ్ దర్యాప్తు చేసే విధానం, అనుమానితులను ప్రశ్నించే సన్నివేశాలు కథకు బలాన్ని చేకూరుస్తాయి. ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా కథలోని సీరియస్‌నెస్‌ను కొనసాగించేలా ఉంటుంది.
అయితే స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్ తరహా కథనాలను ఇష్టపడేవారికి ఈ సినిమా మరింతగా కనెక్ట్ అవుతుంది. వేగంగా సాగే ట్విస్టుల కంటే, ఒక్కో విషయాన్ని నెమ్మదిగా రివీల్ చేస్తూ మిస్టరీని బిల్డ్ చేయడం సినిమాకు ప్రత్యేకత. కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపించినా, తర్వాత వచ్చే మలుపులు ఆ ఆసక్తిని తిరిగి పెంచుతాయి. మొత్తంగా ‘ఉయిర్’లో యాక్షన్ కంటే ఇన్వెస్టిగేషన్‌కు, హడావుడి కంటే మిస్టరీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సహజమైన పోలీస్ దర్యాప్తు, అనుమానాస్పద పాత్రలు, వరుస ట్విస్టులు, చివరి వరకు కొనసాగించే సస్పెన్స్‌ను ఇష్టపడే వారికి ఈ క్రైమ్ థ్రిల్లర్ మంచి ఆప్షన్.
