నటించడంలోనే కాదు.. సమాజ సేవ చేయడంలో అతనో సూపర్ స్టార్. దేవుడిచ్చిన అందంలోనే కాదు.. జీవితం నేర్పిన అనుభవాల్లో అతనో హెల్పింగ్ స్టార్. తన మనసుతో ఎదుటివారి బాధలు అర్ధం చేసుకోగలడు. తన నిండు చేతులతో దగ్గరకి తీసుకుని కన్నీళ్లు తుడవగలడు. ఇంకా గొప్పగా చెప్పాలంటే.. ఎందరో చిన్నారులకి అభయంగా నిలుస్తూ.. వారి జీవితాలకు ఆయుష్షు పోసిన దేవుడతను. 4500కి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి.. ముందుకెళ్తున్న నిస్వార్ధ సేవకుడతను. అతనే మన టాలీవుడ్ సూపర్ స్థార్ మహేష్ బాబు (Mahesh Babu). ఇవాళ (2026 ఆగస్టు 9న) మహేష్ బాబు పుట్టినరోజు. 1975, ఆగష్టు 9న జన్మించిన మహేష్.. నేటితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని.. 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పలువురు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
దైవం మహేష్ రూపేణ..
సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సామాజిక బాధ్యత విషయంలో మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. ‘నలుగురికి సహాయం చేయడం మన బాధ్యత’ అని నమ్మే ఆయన, తన భార్య నమ్రతతో కలిసి ‘MB ఫౌండేషన్’ (మహేష్ బాబు ఫౌండేషన్) ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా మహేష్ బాబు చేస్తున్న సేవల్లో అత్యంత హృదయాన్ని తాకేది.. ‘చిన్నారుల గుండె ఆపరేషన్లకు’ అందిస్తున్న సహాయం. పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నిరుపేద పిల్లలకు మహేష్ బాబు దేవుడై భరోసాగా నిలుస్తున్నారు. ప్రముఖ ‘హార్ట్ అండ్ రెస్క్యూ’ ఆసుపత్రుల సహకారంతో వందలాది మంది చిన్నారులకు ఉచితంగా ప్రాణాపాయ గుండె శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. ఆపరేషన్ విజయవంతమై ఆరోగ్యంగా మారుతున్న పిల్లల ముఖంలో చిరునవ్వు చూసేందుకే ఆయన ఆనందిస్తారు. అందుకే ఆ చిన్నారుల పాలిట మహేష్ బాబు నిజంగానే ఒక ప్రాణదాత, దైవం రూపం.
As @ssrajamouli said, "మీరు ఊహించనంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు"... Superstar @urstrulyMahesh 🫰#HBDSuperstarMahesh #VARANASI pic.twitter.com/jzD65QdB2z
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) August 8, 2026
చదువుకోవాలనుకునే పిల్లలకు భరోసా..
మహేష్ బాబు ఫౌండేషన్ ఆరోగ్యంతో పాటు విద్యకూ ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ ప్రతిభ ఉన్న విద్యార్థులకు చదువుకునేందుకు ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. పిల్లలకు మంచి విద్య లభిస్తే వారి భవిష్యత్తు మారుతుందనే నమ్మకంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
"Balayya babu" Loves "Mahesh babu" 💛
— 𝐒𝐢𝐯𝐚 𝐕𝐨𝐢𝐜𝐞🔥 (@siva_nbk9999) August 9, 2026
5000+ Heart Operations..🙏
2 Villages adopt chesi..
మదర్ మిల్క్ బ్యాంక్ తో, ఎన్నో జీవితాలకి సపోర్ట్❤️
స్క్రీన్ మీద Superstar..📈
రియల్ లైఫ్ లో కూడా one and only Superstar @urstrulyMahesh 👑#HappyBirthdayMahesh pic.twitter.com/0aOSTlpU4o
అంతేకాదు.. అనాథాశ్రమాల్లోని పిల్లలకు వారి అవసరాలకు అనుగుణంగా సహాయం అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల ఆరోగ్యం కోసం మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు కూడా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నాయి. 2025లో బుర్రిపాలెంలో నిర్వహించిన మెగా చైల్డ్ హెల్త్ క్యాంప్‌లో 115 మంది పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించారు. అదే ఏడాది నిర్వహించిన మరో మెగా మల్టీస్పెషాలిటీ హెల్త్ క్యాంప్‌లో 132 మంది పెద్దలు, పిల్లలు ఉచిత వైద్య సేవలు పొందారు.
‘వారణాసి’ కోసం మరోసారి సాహసం..
మహేష్ బాబు సినీ కెరీర్‌లో ఎన్నో యాక్షన్ సీక్వెన్స్, సాహసోపేత సన్నివేశాలు ఉన్నాయి. కానీ, '1: నేనొక్కడినే' సినిమా కోసం ఆయన చేసిన సాహసం మాత్రం ఎప్పటికీ మరువలేనిది. అయితే, ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన ప్రయాణం ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఆయన అడుగుపెడుతున్న ప్రపంచం మరో ఎత్తు. అదే దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’. ఇది కేవలం మరో సినిమా కాదు.. మహేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రయాణాల్లో ఒకటి.
ఈ సినిమా కోసం ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఆఫ్రికాలోని కిలిమంజారో, మసాయి మారా ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. రాజమౌళి తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌లో మహేష్‌ను రుద్రగా కొత్త అవతారంలో చూపించారు. రుద్ర పాత్రలో తెలివితేటలు, సున్నితత్వం, ఆవేశం.. ఇలా ఎన్నో భిన్నమైన షేడ్స్ ఉంటాయని రాజమౌళి చెప్పారు.
రుద్ర అనే ఆర్కియాలజిస్ట్..!
‘వారణాసి’ కథ ప్రపంచాన్ని చుట్టే భారీ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. కథలో ఆఫ్రికా నుంచి అంటార్కిటికా, ప్రాచీన రోమ్ వరకు విభిన్న ప్రాంతాలు భాగమవుతున్నాయని వెల్లడైంది. మహేష్ ఇందులో రుద్ర అనే ఆర్కియాలజిస్ట్, ఎక్స్‌ప్లోరర్‌గా కనిపించనున్నారు. ప్రపంచాన్ని ముప్పు నుంచి కాపాడేందుకు ఒక పురాతన విశ్వ రహస్య కళాఖండాన్ని వెతికే బాధ్యత ఆయనపై పడుతుంది. ఇది నటుడిగా మహేష్‌కు మరో కొత్త పరీక్ష. కొత్త ప్రపంచం.. కొత్త పాత్ర.. కొత్త సాహసం.. కొత్త దర్శకుడు.. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే.. ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించడం. మహేష్ బాబు తెరపై హీరో.. నిజ జీవితంలో కూడా హీరోనే.
Here’s the man you’ll meet in #Varanasi…
— Mahesh Babu (@urstrulyMahesh) November 15, 2025
RUDHRA… pic.twitter.com/SOAUsqQ5bv
