నిర్మాతగా పలు సూపర్ హిట్స్ నిర్మించిన MS రాజు.. దర్శకుడిగా రూపొందించిన మూవీ ‘అగధ’ (AGADHA). మైథాలజీ, థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో మూవీ తెరకెక్కింది. కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. పొలిమేర బ్యూటీ’ కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా, వనిత విజయ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇవాళ శుక్రవారం (ఆగస్టు 14, 2026న) సినిమా థియేటర్లలో విడుదలైంది. టీజర్, ట్రైలర్‌తోనే సస్పెన్స్ క్రియేట్ చేసిన ‘అగధ’ ఎలా ఉంది? ఎలాంటి మిస్టరీయస్ అంశాలతో ఆడియన్స్ను థ్రిల్ చేసింది? డైరెక్టర్ MS రాజు సక్సెస్ అయ్యాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం..
‘అగధ’ కథ:
మహాదేవి (కామాక్షి భాస్కర్ల) చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోతుంది. అనంతరం బాబాయ్ (భానుచందర్) ఇంట్లోనే తన కజిన్స్‌తో కలిసి పెరుగుతుంది మహాదేవి. అయితే మహాదేవి జర్నీ సాధారణ అమ్మాయిలా సాగదు. చిన్న వయసులోనే ఆమెకు ఓ అంతుచిక్కని దైవిక శక్తి (Divine Energy) కనెక్ట్ అవుతుంది. ఆ అదృశ్య శక్తి నీడలోనే ఆమె పెరిగి పెద్దవుతుంది.అనంతరం ఓ సాధువు ఆమెకు ప్రాచీన యంత్ర–తంత్ర విద్యలు నేర్పడంతో, అమాయకులను అతీత శక్తుల నుంచి కాపాడే శక్తివంతమైన రక్షకురాలిగా మారుతుంది.
ఆ శక్తులను సమాజంలో అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు, అమాయకులను కాపాడేందుకు ఉపయోగించాలని చెబుతాడు. అప్పటి నుంచి మహాదేవి ప్రజలను అతీత శక్తుల నుంచి కాపాడే ఒక శక్తివంతమైన రక్షకురాలిగా (Protector) మారుతుంది. అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో, మహాదేవి బాబాయ్ కుటుంబాన్ని ‘అగధ’ అనే భయానక దుష్టశక్తి టార్గెట్ చేస్తుంది. గర్భవతిగా ఉన్న ఆమె కజిన్ ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక ఆపై ఊరిలో వరుసగా మిస్టరీ మరణాలు కూడా జరగడంతో మహాదేవి సొంతూరికి చేరుకుని ఆ రహస్యానికి తెరతీయాలని నిర్ణయిస్తుంది.
అసలు అగధ ఎవరు? మహాదేవి కుటుంబాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? దైవిక శక్తి, దుష్టశక్తి మధ్య జరిగే ఉత్కంఠభరితమైన మైథలాజికల్ పోరులో చివరకు ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ.
మూవీ ఎలా ఉందంటే?
‘‘అగధ’ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుడ్ని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథ ఇది. టీజర్, ట్రైలర్‌తో క్రియేట్ చేసిన మిస్టరీని సినిమా చాలా వరకు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. దైవిక శక్తి వర్సెస్ దుష్టశక్తి అనే కాన్సెప్ట్‌తో సాగే కథలో సస్పెన్స్, ఎమోషన్, మిస్టరీ హారర్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
ఫస్ట్ హాఫ్‌లో మహాదేవి పాత్ర, ఆమె దైవిక శక్తి, యంత్ర–తంత్ర ప్రపంచాన్ని నెమ్మదిగా పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్తారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే మిస్టరీ డెత్స్, ‘అగధ’ ఎంట్రీ కథపై ఆసక్తిని పెంచుతాయి.
►ALSO READ | Nagarjuna : నేనూ సైబర్ ఫ్రాడ్ బాధితుడినే.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!
సెకండ్ హాఫ్‌లో అసలు గేమ్ మొదలవుతుంది. ఊరిని వెంటాడే దుష్టశక్తి వెనుకున్న రహస్యం, మైథలాజికల్ అంశాలతో కూడిన క్లైమాక్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తుంది. ముఖ్యంగా మిస్టరీ మరణాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు ఆసక్తిని కలిగిస్తాయి. కొన్ని సన్నివేశాలు భయపెట్టడంతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది.
నటీనటుల పెర్ఫార్మన్స్..
‘పొలిమేర’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల, ఈ సినిమాలో మహాదేవి పాత్రలో నటించి ప్రాణం పోసింది. దైవిక శక్తులున్న రక్షకురాలిగా, మరోవైపు కుటుంబాన్ని కాపాడుకోవడానికి తపించే బాధ్యత గల అమ్మాయిగా ఆమె నటన ఎమోషనల్‌గా మరియు పవర్‌ఫుల్‌గా సాగుతుంది. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా, వనిత విజయ్ కుమార్, మరియు భానుచందర్ తమ పాత్రల పరిధి మేరకు నటించి కథను ముందుకు నడిపించారు.
టెక్నీకల్..
‘అగధ’కు టెక్నికల్ టీమ్ ప్రధాన బలంగా నిలిచింది. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను డార్క్, మిస్టికల్ టోన్‌లో ఆవిష్కరిస్తూ హారర్ వాతావరణాన్ని బాగా ఎలివేట్ చేసింది. ఆలయాలు, అడవి ప్రాంతాలు, రాత్రి సన్నివేశాలను విజువల్‌గా ఆకట్టుకునేలా చిత్రీకరించారు. రాకేశ్ వెంకటాపురం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా థ్రిల్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా సస్పెన్స్, అతీత శక్తుల ఎపిసోడ్స్‌లో సంగీతం మంచి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుంది.
ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ మైథాలజికల్ ప్రపంచాన్ని నమ్మించేలా ఉన్నాయి. ఇక ఫైనల్ గా.. డైరెక్టర్ MS రాజు.. ఒక సాధారణ రివెంజ్ లేదా హారర్ కథలా కాకుండా, దీన్ని ఒక మైథలాజికల్ థ్రిల్లర్‌గా మలచడంలో సక్సెస్ అయ్యాడు.
