వెలుగు స్పెషల్ : ప్రజల హక్కు ప్రజాసేవల హక్కు చట్టం

వెలుగు స్పెషల్ : ప్రజల హక్కు ప్రజాసేవల హక్కు చట్టం

ప్రజలకు హక్కుగా లభించాల్సిన ప్రభుత్వ సేవలను నిర్దేశించిన గడువులోగా అందించేందుకు,  అలాగే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం లేదా జాప్యం కారణంగా సేవలు అందకపోతే అటువంటి అధికారులకు జరిమానా విధించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు దేశంలోని 22 రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చాయి.  కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం. ఈ చ‌‌‌‌ట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం తప్పనిసరిగా పౌర హక్కుల పత్రాన్ని (సిటిజన్స్‌‌‌‌ చార్టర్‌‌‌‌‌‌‌‌) రూపొందించాలి. 

అందులో ఏయే సేవలను ఎన్ని రోజుల్లో అందిస్తారో, ఆయా సేవలను అందించడానికి బాధ్యత వహించే అధికారి ఎవరో స్పష్టంగా పేర్కొనాలి. నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారి సేవలను అందించని పక్షంలో, బాధిత పౌరుడు పై అధికారికి అప్పీలు చేసుకునే అవకాశం కల్పించాలి. అప్పీలు అధికారి విచారణ జరిపి, సరైన కారణం లేకుండా లేదా ఉద్దేశపూర్వకంగా సేవలను అందించని పక్షంలో స‌‌‌‌ద‌‌‌‌రు అధికారికి జరిమానా విధించ‌‌‌‌డానికి ఈ చట్టంలో సంబంధిత సెక్షన్‌‌‌‌ పొందుపరచాలి.   అలాగే ఈ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించడానికి కమిషన్ ఫర్ రైట్ టు సర్వీస్‌‌‌‌ను ఏర్పాటుచేయాలని చ‌‌‌‌ట్టం నిర్దేశిస్తున్నది. 

తెలంగాణ రాష్ట్రంలో సామాన్య పౌరుడు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వనిదే పని జరగని పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగంగా, ఎటువంటి జంకూగొంకూ లేకుండా లంచాలు తీసుకుంటూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  రైట్ టు పబ్లిక్ సర్వీస్ చట్టం  అమలులోకి వస్తే,  సామాన్య ప్రజలకు నిర్ణీత గడువులోగా ప్రభుత్వ సేవలు అందడమే కాకుండా, విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో నెలకొన్న అవినీతి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైట్ టు పబ్లిక్ సర్వీస్ చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేయాల్సిన అవసరం ఉంది.

 యం. పద్మనాభరెడ్డి
అధ్యక్షుడు, ఫోరం ఫ‌‌‌‌ర్ గుడ్ గ‌‌‌‌వ‌‌‌‌ర్నెన్స్‌‌‌‌
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.