ఖమ్మం జిల్లాలో గ్రానైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వారీలపై ప్రజాభిప్రాయ సేకరణ

ఖమ్మం జిల్లాలో గ్రానైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వారీలపై  ప్రజాభిప్రాయ సేకరణ

నేలకొండపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా  సింగారెడ్డి పాలెం రెవెన్యూ పరిధిలో రెండు గ్రానైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వారీల ఏర్పాటుకు గురువారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అడిషనల్​కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బైరు ధనలక్ష్మి, బైరు సాయికృష్ణకు చెందిన రెండు క్వారీలపై స్థానికుల అభిప్రాయంతో పాటు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

నూతన క్వారీల వల్ల స్థానికంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని, క్వారీల నుంచి వెలువడే కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలను నాటాలని, నీటి కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్వారీల పరిధిలోని పది కిలోమీటర్ల మేర ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఈ సేకరణ చేపట్టినట్లు అడిషనల్​ కలెక్టర్ తెలిపారు. 

తలనొప్పిగా మారిన ఎన్జీవోల తీరు

పర్యావరణ హియరింగ్ లో ఎన్జీఓలు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. అనంతరం ఎన్జీఓలు తమకు టీఏడీఏలు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరాయి. వందలమంది రావడంతో అందరికీ డబ్బులివ్వడానికి క్వారీ యజమానులు ఒప్పుకోలేదు. దీంతో ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. దీంతో ఎస్సై శ్రీనివాసరెడ్డి ఎన్జీఓలను మందలించడంతో స్టేషన్ వద్ద హై డ్రామా నడిచింది. ఎట్టకేలకు ఎన్జీఓలతో చర్చించి అక్కడి 
నుంచి పంపించేశారు.